పరారీలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి

SMTV Desk 2018-11-08 13:05:32  Mining King Gaali Janardhan reddy,

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బుధవారం (నవంబర్ 7) ఉదయం జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా.. అప్పటికే ఆయన పారిపోయినట్లు తెలిసింది. ఓ మార్కెటింగ్ సంస్థ రూ. 600 కోట్లకు ప్రజలను మోసం చేయగా, ఈడీ కేసుల నుంచి సంస్థను బయట పడేయించేందుకు రూ. 18 కోట్లతో డీల్ కుదుర్చుకుని, కోటి రూపాయల లంచం ఇచ్చారన్నది గాలిపై ఆరోపణలు. దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విస్తృత తనిఖీలు ప్రారంభించి, రెండు రోజులు గడిచినా, గాలి ఆచూకీ విషయమై వొక్క వివరమూ సేకరించలేకపోయారు.

తమ నేత ఎక్కడున్నారన్న విషయాన్ని ఆయన అనుచరులు, కుటుంబీకులు కూడా చెప్పడం లేదు. దీంతో ఆయన విజయ్ మాల్యా మాదిరిగా దేశం విడిచి వెళ్లి ఉండవచ్చని కొందరు పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు నాలుగు రోజుల వ్యవధిలో విదేశాలకు వెళ్లిన వారి వివరాలను పరిశీలిస్తున్నారు.గాలి జనార్దన్ రెడ్డి ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా వారు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. అంతలోనే వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయినట్లు గుర్తించారు..