‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హ్యుమానిటీ’ చిన్నారులతో దీపావళి వేడుకలు

SMTV Desk 2018-11-08 11:07:59  Telangana MP, KTR, Diwali Celebrations, Helping Hands Humanity

హైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ అధికార పార్టీ మంత్రి కేటీఅర్ దీపావళి పర్వదినాన్ని హైదరాబాద్‌కు చెందిన ఎన్జీవో ‘హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హ్యుమానిటీ చిన్నారులతో జరుపుకున్నారు.ఈ క్రమంలో ఆ విషయాలన్నీ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘చాలా కాలం తర్వాత బెస్ట్‌ దీపావళి జరుపుకొన్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. చిన్నారులతో కలిసి దిగిన ఫొటోలను ఆయన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. నా తరఫు నుంచి వాళ్లకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాను. వారికి ప్రస్తుతం అవసరాల కోసం రూ.12లక్షల చెక్కు ఇచ్చాను. దయచేసి మీరు కూడా సహాయం చెయ్యండి అంటూ కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా కోరారు. సంతోషంగా పిల్లలతో మాట్లాడుతూ వారితో గడిపారు. ఈ సందర్భంగా వారికి చెక్లెట్ల ప్యాకెట్ ను బహుమతిగా అందించారు.