మహిళా జట్టు ఫైనల్ కు

SMTV Desk 2017-07-21 16:55:25  womens criketers, india arstrelia , samifinal win final, england

న్యూఢిల్లీ, జూలై 21 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ అపూర్వ విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (171 నాటౌట్‌; 115 బంతుల్లో 20×4, 7×6) చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడిన వేళ.. మన అమ్మాయిల జట్టు 36 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను కంగుతినిపించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట హర్మన్‌ప్రీత్‌ మెరుపులతో భారత్‌ 42 ఓవర్లలో 4 వికెట్లకు 281 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్‌ పోరాడినా 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం జరిగే తుది సమరంలో భారత్ ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మేరకు మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత జట్టుకు మాజీ క్రికెటర్స్ అందరు అభినందనలు తెలిపారు. కెప్టెన్ మిథాలీ సారథ్యం, హర్మన్‌ప్రీత్ అజేయ సెంచరీ అందరికీ స్ఫూర్తినిచ్చింది. ఇదే జోరును ఫైనల్లోనూ కొనసాగించి కప్పు సాధించాలని కోరుకుంటున్నట్లు మహిళా జట్టు సభ్యులు తెలిపారు.