దీపావళి రోజు 13౦౦ కి పైగా కేసులు నమోదు

SMTV Desk 2018-11-08 10:43:50  Diwali, Supreem Court, police Case

తమిళనాడు, నవంబర్ 8: దీపావళి పర్వదినాన టపాసులు ఎక్కువగా కాల్చకూడదని కేవలం రెండు గంటల వ్యవధిలోనే టపాసులు కాల్చాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పుని ఉల్లంగించి తమిళనాడులో కొంత మంది టపాసులు కాల్చుతూ వుండగా పోలీసులు వారి పై కేసు నమోదు చేశారు. దాదాపు 13౦౦ మంది కి పైగా కేసు నమోదు చేసారని సమాచారం.

చెన్నైలో 350 మందిపై కేసులు,విల్లుపురం జిల్లాలో 50 మందిపై ఐపీసీ 188, 285 సెక్ష‌న్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి, పలువురిని అరెస్ట్ చేశారు. దీపావళి పండుగ నాడు ఈ తరహా నిబంధన విధించడం పట్ల అటు టపాసుల వ్యాపారులు, సామాన్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే వివిధ పట్టణాల్లో పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.