అలరిస్తున్న దేవ్ టీజర్

SMTV Desk 2018-11-05 17:10:08  Karthi, Surya, Harish Jayaraj, Rajath Ravishankar, Tollywood, Dev

తమిళనాడు, నవంబర్ 5: తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న స్టార్స్ చాలా తక్కువే. అందులో సూర్య, కార్తి అన్నదమ్ములు ఇద్దరూ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కార్తి రజత్ రవిశంకర్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా దేవ్. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. కార్తి సరసన రకుల్ మరోసారి జతకట్టిన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు.కార్తి బైక్ రేసర్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఎవరో చెప్పినట్టు బ్రతకడం కన్నా తనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఆస్వాదించడం అనే కాన్సెప్ట్ తో సినిమా వస్తుంది. కార్తి ఈ సినిమాలో కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. సినిమాలో స్టైలిష్ లుక్ లో కార్తి అదరగొట్టాడు. హారిస్ జైరాజ్ మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.