ప్రేమ పాటాలు నేర్పించాలనుకొని గొంతు కోసాడు

SMTV Desk 2018-11-04 15:35:38  Scool girl, Teacher, High School, Murder

కర్నూల్, నవంబర్ 4: కర్నూలు జిల్లా బంగారుపేటలో శంకర్ నాయక్ అనే యువకుడు అదే గ్రామంలోని ఓ స్కూల్ లో హిందీ పండిట్ గా పని చేస్తున్నాడు. అదే స్కూల్ లో ఓ విద్యార్థిని 9 వ తరగతి చదువుతోంది.

ఆ విద్యార్థిని ఇంటి దగ్గర్లోనే ఈ టీచర్ కూడా అద్దెకు ఉంటున్నాడు. దీంతో ఆ విద్యార్థిని ప్రేమించమంటూ రోజు పాటాశాలలో వేధించేవాడు. దీనికి ఆ అమ్మాయి నిరాకరించడంతో ఆ టీచర్ తనని అంతం చేయాలనుకొని శనివారం ఉదయం అమ్మాయి తల్లిదండ్రులు పనికి వెళ్లినప్పుడు ఇంట్లోకి వెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో విద్యార్థిని గొంతు కోశాడు. విద్యార్థిని అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని అతడిని పట్టుకోబోయారు. దీంతో అతడు కూడా గొంతుకోసుకోబోయాడు. ఇంతలోనే వాళ్లు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించారు. విద్యార్థినిని, అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.