ఏపీ సీఎం పై విరుచుకుపడ్డ పవన్

SMTV Desk 2018-11-04 15:05:43  Pawan Kalyan, Chandrababu Naidu, Janasena, TDP

తూ.గో.జి, నవంబర్ 4: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మల్లీ చంద్రబాబు పై మండిపడ్డారు. ఈ క్రమంలో మాట్లాడుతూ 'సామాజిక మార్పు కోసమే జనసేన పార్టీని స్థాపించాను..భాజపాలో, లేక ఇతర పార్టీలలో కలపడానికి కాదని వివరించారు. తెదేపా అవినీతిలో పాలుపంచుకోవడం ఇష్టం లేని కారణంగా తాను వొక్క పదవిని కూడా తీసుకోలేదని' చెప్పుకొచ్చారు.

తెదేపా అధినేత ఈ మధ్య కొత్త డ్రామా మొదలు పెట్టారు… భాజపేతర పార్టీలను కూడ గట్టడంలో భాగంగా కేంద్రం మెడలు వంచేందుకు జాతీయ నేతలను కూడగడుతున్నానని చెబుతున్న చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీతో గొడవ పెట్టుకునే కనీస నైతిక బలం లేదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబులా తాను అవకాశవాదిని కాదని వెల్లడించారు. ప్రజా సేవ కోసమే రాజకీయ పార్టీని స్థాపించ అన్నారు. డ్వాక్రా మహిళలను తెదేపా కార్మికులుగా మార్చేశారన్నారు. ఎమ్మెల్యేల ప్రాణాలను కాపాడలేని చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమర్ధుడేనా అని పవన్ సూటిగా ప్రశ్నించారు. ఇకనైనా గెలుపు కోసం ఆరాటం ఆపమన్నారు.