హాలీవుడ్ రేంజ్ లో 2.O ట్రైలర్

SMTV Desk 2018-11-04 14:20:08  Rajinikanth, Shankar, Akshay Kumar, Amy Jackson, LYKA Productions, AR Rehman, Trailer, Robo 2.O

హైదరాబాద్, నవంబర్ 4: గ్రేట్ శంకర్ , తలైవా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రోబో 2.O ఈ చిత్రం రోబోకి సీక్వెల్ గా తీస్తున్నట్లు తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 550 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచగా ఈ సినిమా ట్రైలర్ నిన్న రిలీజై సంచలనం సృష్టిస్తుంది. అంచనాలకు తగినట్టుగానే శంకర్ చేసిన అద్భుత సృష్టి ఈ 2.ఓ అనేలా ఉంది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.సినిమాలో రజినికి ప్రతి నాయకుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నవంబర్ 29న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టేసింది. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా టేకింగ్ ఉంది. రోబోతో సంచలనాలు సృష్టించిన శంకర్ 2.ఓ తో ఇంకా ఎన్ని రికార్డులు కొల్లగొడుతారో.