షకీల జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో తానె అథిదిగా

SMTV Desk 2018-11-01 17:07:43  Shakila, Richachadda, Indrajit Lonkesh

హైదరాబాద్ : ప్రముఖ తార షకీలా జీవితదారంగా వొక సినిమా వస్తోందని చాలా రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. చివరకు ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. ఈ బయోపిక్‌ను మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ రూపొందిస్తున్నాడు.జిల్లాకి చెందిన షకీలా సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? శృంగారతారగానే కొనసాగడానికి గల కారణాలు ఏమిటి? ఆమె జీవితంలో వివిధ మలుపులు, మజిలీలు.., అనే ఆసక్తికరమైన అంశాలు ఈ బయోపిక్‌లో వుంటాయట.

అలాగే తనని సినీరంగంలో ఎవరెవరు మోసం చేశారు ? ఆమె శృంగారతారగా మారడానికి గల బలమైన కారణాలు వంటివి కూడా ఈ సినిమాలో ప్రధాన ఇతివృత్తంగా వస్తాయట. కాగా ఈ సినిమాలో షకీలా పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏంటంటే.. షకీలా ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందట. తన బయోపిక్‌లో తానే అతిథి పాత్రలో కనిపించడం షకీలాకు చాలా ప్రత్యేకం అనే చెప్పొచ్చు.