హీరోగా పరిచయమవుతున్న కీరవాణి తనయుడు

SMTV Desk 2018-11-01 14:49:15  MM Keeravani, Kala Bhairava, Simha Kodoori, Mythri Movie Makers

హైదరాబాద్, నవంబర్ 1: ప్రముఖ సంచలన సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారులు వొక్కొక్కరిగా ఇండస్ట్రీలో స్థిరపడుతున్నారు. ఇప్పటికే ఆయన కుమారుల్లో వొకరైన కాల భైరవ గాయకుడిగా మంచి పాటలు పాడి పాపులర్ అవగా ఇప్పుడు అయన ఇంకో కుమారుడు సింహ కోడూరి హీరోగా పరిచయం కానున్నాడు.

నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక్కడ విశేషమేమిటంటే ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని అందించనున్నాడు. ఇకపోతే సింహ గతంలో రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘మర్యాద రామన్న’ చిత్రంలో వొక చిన్న పాత్రలో నటించడం జరిగింది.