ముచ్చటగా మూడోసారి

SMTV Desk 2018-11-01 12:29:43  Trivikram, Allu Arjun, Harika and Hassini Creations,

ఫిలిం నగర్, నవంబర్ 1: మాటల మాంత్రికుడు త్రివిక్రం అరవింద సమేత తర్వాత ఎవరితో సినిమా చేస్తాడు అన్న విషయంపై చివరికి వొక క్లారిటీ వచ్చింది. కొన్నాళ్లుగా వార్తల్లో ఉన్నట్టుగానే త్రివిక్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తోనే తన తర్వాత సినిమా చేస్తున్నాడట. దీనికి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. నా పేరు సూర్య నిరాశ పరచగా బన్ని త్రివిక్రం సినిమాతో సత్తా చాటాలని చూస్తున్నాడు.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 11 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారట. అరవింద సమేత తర్వాత త్రివిక్రం ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బన్ని సినిమా మొదలు పెడుతున్నాడు. మరి క్రేజీ కాంబోగా వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.