చివరి వన్డేలో విజయమేవరిదో...?

SMTV Desk 2018-11-01 11:57:05  India, West Indies, 5th ODI

తిరువనంతపురం, నవంబర్ 1: భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో నేడు ఆఖరి వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడి 2-1తో భారత జట్టు ఆధిక్యంలో ఉంది. దీనితో నేటి మ్యాచ్ డ్రా అయినా అవ్వాలి, లేదంటే ఖచ్చితంగా భారత్ గెలవాలి.. అప్పుడే సిరీస్ కైవసం అవుతుంది. టెస్టుల్లో కూడా భారత్ ముందంజలో ఉన్నా, వన్డేలలో మాత్రం వెస్టిండీస్ ఆతిధ్య జట్టుకు గట్టి పోటీనే ఇస్తుంది. నేటి మ్యాచ్ వెస్టిండీస్ గెలిచినా ఆ దేశానికీ పెద్దగా ప్రయోజనం లేకున్నా సిరీస్ టై అవుతుంది. దీనితో నేటి ఆట ఆతిధ్య జట్టు కు కీలకంగా మారింది.

నేడు తిరువనంతపురంలో గ్రీన్ ఫీల్డ్ మైదనంలో జరగనున్న మ్యాచ్ కి వాతావరణం అనుకూలంగా లేకపోవచ్చనే వాతావరణ శాఖ చెపుతుంది. దీనితో ఆట ఆగితే ఇక ఫలితం ఏమవనుందో చూడాల్సి ఉంది. ఇరు జట్లు అయితే పోటీకి సిద్ధంగా ఉన్నాయి. వొక జట్టు సిరీస్ కోసం, మరొక జట్టు డ్రా అన్నా చేద్దామని కసిగా ఎదురుచూస్తున్నాయి. విండీస్ జట్టు ఈ సిరీస్ గెలిస్తే వరుసగా ఆరు సార్లు స్వదేశంలో జరిగిన సిరీస్ లలో గెలిచినా అరుదైన చరిత్ర నమోదు చేసినట్టే.

ఇక నేటి మ్యాచ్ లో కూడా టాస్ గెలిస్తే.. భారత జట్టు సారధి కోహ్లీ కూడా వరుసగా ఐదోసారి టాస్ గెలిచినా రికార్డు కెక్కుతారు. అలాగే 2015 నుండి వరుసగా వెస్టిండీస్ తో జరిగే సిరీస్ ను గెలుస్తున్న భారత్ ఆ రికార్డును నేటి గెలుపుతో నిలబెట్టుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఆటంకాలు ఏమి లేకపోతే నేటి వేదిక కూడా భారీ స్కోర్ లకు నెలవు కానుంది. మొత్తానికి నేటి మ్యాచ్ లో ఉత్కంఠ అయితే తప్పకుండ ఉండనుంది.. అది గెలిపైనా, మరొకటైన.ఇరు జట్లలో పెద్దగా మార్పులు ఏమి లేవు. ఇప్పటి వరకు ఆడినవారే కొనసాగుతారు.