టాక్సీ వాల రిలీజ్ కి ముందే సగం వసూళ్లు

SMTV Desk 2018-11-01 11:48:12  Vijay Devarakonda, Rahul Sankruthyan, Geetha Arts2 Pictures, UV Creations, Taxiwala, Sattilite Rights,

ఫిలిం నగర్, నవంబర్ 1: ఆటిట్యూడ్ కింగ్ విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ బ్యానర్ కలిసి నిర్మించిన సినిమా టాక్సీవాలా. రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 16న రిలీజ్ కు సిద్దంగా వుంది. నోటా రిలీజ్ తో కాస్త వెనుకపడ్డ విజయ్ దేవరకొండా టాక్సీవాలాతో సత్తా చాటాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా రష్ మొత్తం లీక్ అవగా సినిమాకు అనుకున్నంత బజ్ ఏర్పడలేదు.

అయినా సరే ఈ ప్రాజెక్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చిందని తెలుస్తుంది. కేవలం 6 కోట్ల ఖర్చుతో చేసిన టాక్సీవాలా ఇప్పటికే శాటిలైట్ రూపంలో రెండున్నర కోట్ల దాకా రాబట్టిందట. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎలా లేదన్నా విజయ్ సినిమా మొదటి రోజే 4 నుండి 5 కోట్లు రాబడుతుంది. టాక్ బాగుంటే రెండు మూడు రోజుల్లో టాక్సీవాలా ప్రాఫిట్స్ లోకి వచ్చేస్తుందని అంటున్నారు. వొకవేళ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా పెద్దగా లాసులు వచ్చే ఆస్కారం లేదని అంటున్నారు. మొత్తానికి టాక్సీవాలా విజయ్ కు పాజిటివ్ రిజల్ట్ తెచ్చేలా ఉంది.