టాక్సీవాలా ‘మాటే విన‌దుగా’ పాట లిరిక‌ల్ వీడియో

SMTV Desk 2018-10-31 18:31:43  Vijay devarakonda, Taxiwala, Mythri movie makers, Geetha arts2 pictures

ఫిలిం నగర్, అక్టోబర్ 31: విజయ్ దేవరకొండ యూత్ అందరూ ఆటిట్యూడ్ కింగ్ అని పిలుస్తూ వుంటారు. విజయ్ నటించిన టాక్సీవాలా చిత్రం నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణలతో ఆలస్యమైంది. ప్రస్తుతం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ‘మాటే వినదుగా’ పాట లిరికల్ వీడియోని ఇటీవల విడుదల చేసింది..



ఈ పాట ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. అంతేకాదు విడుదల చేసిన కొద్దిసేపటికే 2 మిలియన్ వ్యూస్ సంపాదించింది. దీంతో ఈ పాటకు సంబంధించిన వీడియో విడుదల చేశారు. ఇందులో విజ‌య్ టాక్సీ డ్రైవ‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ పాట‌కి కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, జేక్స్ సంగీతం అందించాడు. జిఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విజ‌య్‌కి మ‌రో హిట్ అందిస్తుంద‌ని అందరు భావిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో తెర‌కెక్కించిన‌ట్టు సమాచారం.