వైరముత్తుకి అండగా మరిముత్త

SMTV Desk 2018-10-31 18:18:20  Mee too, Vairamuttu, Chinamayi, Kollywood, Marimuttu

చెన్నై, అక్టోబర్ 31: మీ టూ తరుపున లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ సినీ గేయరచయిత వైరముత్తుకు మద్దతు రోజు రోజ్కి పెరుగుతూ వుంది. గాయని చిన్మయి శ్రీపాదతోపాటు పలువురు గాయనులు మీటూ పేరుతో ఆయనపై విమర్శలు చేస్తున్నా కోలీవుడ్ ఆయనకు అండగానే నిలబడుతోంది. వైరముత్తు కూడా హార్మోన్లు ఉన్న మగవాడే అని, అతడు మహిళలతో పడుకుంటే తప్పేం లేదని నటదర్శకుడు మరిముత్తు అన్నారు. దీనిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘వైరముత్తు తప్పుడు పనేమీ చేయలేదు. అతడు బంగారం షాపులో దొంగతనం చేస్తే సిగ్గుపడాలి. మరొకటి చేస్తే తప్పుపట్టాలి. అతడు అలాంటి నేరాలేవీ చేయలేదు. ఓ మహిళను గదికిలోకి పిలిచాడు. అంతేకదా.. అందులో తప్పేముంది? వైరముత్తు కూడా మనిషే కదా. అతని శరీరంలోనూ హార్మోన్లు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అతనికి గదిలో ఆడమనిషితో గడపడంలో ఆనందం ఉండొచ్చు. సదరు మహిళకు ఇష్టమైతే అతని గదిలోకి వెళ్తుంది. లేకపోతే మీ మీడియా వద్దకు వస్తుంది.. ’ అని మరిముత్తు వ్యాఖ్యానించారు. వైరిముత్తు మహిళల అంగీకారంతో శృంగారంలో పాల్గొనలేదని, అతడు వేధింపులకు, బెదిరింపులకు పాల్పడ్డాడని, మరిముత్తు దీనిపై స్పందించాలని బాధితులు నిలదీస్తున్నారు.