త్రివేండ్రంలో భారీ కటౌట్ ను ప్రతిష్టించిన ధోని అభిమానులు

SMTV Desk 2018-10-31 17:23:23  MS Dhoni, Fans following, Thrivendram, 5th odi,

త్రివేండ్రం, అక్టోబర్ 31: ఎమ్మెస్ ధోనీకి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎక్కడికెళ్లినా పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ కోట్లలో ఉన్నారు. అతనిపై తమ అభిమానాన్ని ఎలాగోలా చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఇండియా, వెస్టిండీస్ మధ్య జరగబోయే ఐదో వన్డేకు ఆతిథ్యమిస్తున్న త్రివేండ్రంలో ఇలాగే ధోనీ అభిమానులు కొందరు 35 అడుగుల ఎత్తున్న అతని కటౌట్‌ను తయారు చేయించారు. ఆల్ కేరళ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్ త్రివేండ్రంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం బయట ఈ కటౌట్ ఏర్పాటు చేశారు.ఈ కటౌట్‌ను తయారు చేస్తున్నప్పటి వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ఈ సిరీస్‌లో ధోనీ బ్యాట్‌తో పెద్దగా రాణించకపోయినా.. తనకు మాత్రమే సాధ్యమైన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు.