పవన్ తో సినిమా తప్పనిసరి

SMTV Desk 2018-10-31 14:18:08  Janasena party, Pawan kalyan, Elections, Mythri movie makers

ఫిలిం నగర్, అక్టోబర్ 31: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ సినిమాలు చేస్తారో లేదో అని ఇక తెర మీద పవర్ స్టార్ ను చూడటం కష్టమే అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే పవన్ మళ్లీ సినిమాల్లో నటించడం ఖాయమని కొందరు అంటున్నారు. 2019 ఎన్నికల తర్వాత పవర్ స్టార్ మళ్లీ సినిమాలు చేస్తారట. ఈ విషయాన్ని గట్టిగా చెబుతున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు.

శ్రీమంతుడు సినిమా నుండి అభిరుచి గల సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ పవన్ కళ్యాన్ తో సినిమాకు కొంత అడ్వాన్స్ ఇచ్చారట. సంతోష్ శ్రీనివాస్ డైరక్షన్ లో మూవీ ఉండాల్సింది క్యాన్సిల్ అయ్యింది. అయితే ఇదేమి పెద్ద ఇష్యూ కాదని పవన్ దగ్గర తమ అడ్వాన్స్ ఉంది ఆయన్ను మేము తిరిగి ఇవ్వమని అడగలేదు. ఎన్నికల తర్వాత కచ్చితంగా ఆయన సినిమా చేస్తాడని అంటున్నారు మైత్రి నిర్మాతలు. వీరు ఇంత ధైర్యంగా చెబుతున్నారు అంటే పవన్ హామి ఇచ్చే ఉంటాడు. మొత్తానికి పవన్ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటాడా లేదా అని దిగులుపడే ఫ్యాన్స్ కు ఇదో శుభవార్త అన్నట్టే.