ఎన్నికల వేల వింత అనుభావాల్ని ఎదురుకుంటున్న ప్రజలు

SMTV Desk 2018-10-31 13:36:14  Telangana elections, Vivekananda, TRS

మేడ్చల్, అక్టోబర్ 31: కుత్బుల్లాపూర్ తెరాస అభ్యర్థి వివేకానంద ఎన్నికల ప్రచార సందర్బంలో దారిలో వొక మహిళ తన చిన్నపిల్లాడికి స్నానం చేయిస్తుండగా, వివేకానంద హడావుడిగా ఆమె చేతిలో ఆ పిల్లాడిని తీసుకొని తనే స్నానం చేయించడంతో అందరూ మూసిముసినవ్వులు నవ్వుకొన్నారు.

అదేవిదంగా నిన్న వొక వ్యక్తి తన ఇంటి బయట రోడ్డుపక్కన స్నానం చేయిస్తుంటే అటుగా వెలుతున్న తెరాస అభ్యర్ధి అతనికి సబ్బు రుద్ది స్నానం చేయించడం చూసి అందరూ నవ్వుకొన్నారు. మరికొందరు బట్టలు ఇస్త్రీ చేస్తే, మరో అభ్యర్ధి తన ఊరిలో చనిపోయిన వ్యక్తి పాడె మోసి ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.