సీవోఏకు గంగూలీ లేఖ

SMTV Desk 2018-10-31 13:24:07  Sorav gangooli, BCCI, Mee too, Team india

కోల్‌కత్తా, అక్టోబర్ 31: భారత మాజీ కెప్టన్ సౌరవ్‌ గంగూలీ క్రికెట్‌ పరిపాలక మండలి (సీవోఏ)కి లేఖ రాశాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌ ప్రమాదంలో ఉందని అలాగే బీసీసీఐలో లైంగిక దాడుల ఆరోపణలు రావడం.. వాటిపై ఆలస్యంగా స్పందించడం గందరగోళానికి దారితీస్తున్నాయని ఆ లేఖలో ఆయన పేర్కొన్నాడు. ఎన్నోఏళ్లు భారత క్రికెట్‌కు సేవలందించిన నేను ప్రస్తుత పరిణామాలపై ఎంతో విచారిస్తున్నాను. క్రికెట్‌ అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారుగ అని గంగూలీ ఆ లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడు.