జనసేన పార్టీకి అమ్మ బలం

SMTV Desk 2018-10-30 19:10:01  Pawan kalyan, Anjana devi, Janasena party, Elections

హైదరాబాద్, అక్టోబర్ 30: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో తన తల్లి అంజనా దేవి గారు నగరంలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంలో ఆ పార్టీ కి తన తరుపున రూ. 4 లక్షలు విరాలంగా ఇచ్చారు. అంజనా దేవి గారు చెక్కు ఇచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదిస్తూ తను ప్రజలకి సేవ చేయాలనీ పెట్టిన జనసేన పార్టీ ఏపీ లో విజయ భేరి మ్రోగించాలి అని దీవించింది. తరువాత పవన్ తన తల్లి పాదాలు తాకి నమస్కరించుకున్నాడు.

ఇద్దరు కొంత సమయం అక్కడ గడిపిన తరువాత అంజనా దేవి గారిని తన కారు వద్దకు తీసుకెళ్లి క్షేమంగా సాగనంపారు. ఇది చూస్తున్న వారందరికి అక్కడ వొక కన్నుల పండుగగా అనిపించింది అంటూ పార్టీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది