తలపతి తెలుగు బాక్సాఫీస్ మీద కన్నేశాడు

SMTV Desk 2018-10-30 18:22:37  Vijay thalapthy, Kollywood, Sarkar

చెన్నై, అక్టోబర్ 30: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తమిళంలో రజినికాంత్ కు ఏ మాత్రం తగ్గకుండా ఫ్యాన్ ఫాలోయింగ్ వున్నా వ్యక్తి. తన వరుస సినిమా రికార్డ్ కలక్షన్స్ తో రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న విజయ్ సినిమా అంటే చెన్నై, కేరళలో సందడి మొదలైనట్టే. అయితే ఎప్పటినుండో తెలుగులో సత్తా చాటాలని చూస్తున్నా అతని సినిమాలు తెలుగులో అంత బాగా ఆడట్లేదు. తెలుగులో అతను సరిగా దృష్టి పెట్టలేదు అన్నది కూడా వాస్తవమే.

కాని తెలుగు హీరోలే తమిళ పరిశ్రమ మీద ఎటాక్ చేస్తున్న ఈ తరుణంలో విజయ్ కూడా తెలుగు మార్కెట్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది. అందుకే రాబోతున్న సర్కార్ సినిమా తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. వల్లభనేని వంశీ తెలుగులో సర్కార్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 750 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఎలాగు తెలుగులో ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలేవి లేవు అందుకే విజయ్ ఈసారి తెలుగులో కూడా సత్తా చూపడం ఖాయమని అంటున్నారు. మరి విజయ్ అనుకున్నట్టుగా తెలుగు బాక్సాఫీస్ మీద ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి.