మహాకూటమిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరేనా...?

SMTV Desk 2018-10-30 16:45:28  Telangana elections, Mahakootami, Congress

హైదరాబాద్, అక్టోబర్ 30: కాంగ్రెస్ పార్టీ మహాకూటమి సీట్ల పంచాయితీ తెగకున్నా ముందుకు దూసుకెళ్తోంది. నవంబర్ 1న 35 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేస్తామని పార్టీ చెప్పగా, రెండు రోజుల ముందే అది బయటికి వచ్చేసింది. ఇందులో 40 మంది అభ్యర్థులు ఉన్నారు. గెలుపు గుర్రాలుగా భావిస్తున్న పార్టీ కీలక నేతల్లో పలువురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

అయితే దీనిపై పార్టీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువరించలేదు. సీనియర్ నేతలు మీడియాకు లీకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ జనసమితి, టీడీపీ, సీపీఐల స్పందన తెలుసుకోవడానికి దీన్ని లీక్ చేసినట్లు భావిస్తున్నారు.
అభ్యర్థుల జాబితా





#హైదరాబాద్ జిల్లా

గోషామహల్ – ముకేష్ గౌడ్
సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
జూబ్లిహిల్స్ – విష్ణు

#రంగారెడ్డి జిల్లా

మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
పరిగి – రామ్మోహన్ రెడ్డి

#మెదక్ జిల్లా

జహీరాబాద్ – గీతారెడ్డి
అందోల్ – దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి – జగ్గారెడ్డి
నర్సాపూర్ – సునీత లక్ష్మారెడ్డి
గజ్వేల్ – ప్రతాప్ రెడ్డి

#ఖమ్మం జిల్లా

మథిర – భట్టి విక్రమార్క

#నల్గొండ జిల్లా

హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
నాగార్జున్ సాగర్ – జానారెడ్డి
ఆలేరు – బూడిద భిక్షమయ్యగౌడ్
నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – అద్దంకి దయాకర్

#మహబూబ్ నగర్ జిల్లా

కొడంగల్ – రేవంత్ రెడ్డి
గద్వాల్ – డీకే అరుణ
వనపర్తి – చిన్నారెడ్డి
కల్వకుర్తి – వంశీచంద్ రెడ్డి
ఆలంపూర్ – సంపత్
నాగర్ కర్నూల్ – నాగం జనార్థన్ రెడ్డి

#నిజామాబాద్ జిల్లా

కామారెడ్డి – షబ్బీర్ అలీ
బోధన్ – సుదర్శన్ రెడ్డి
బాల్కొండు – ఇరావత్రి అనిల్

#ఆదిలాబాద్ జిల్లా

నిర్మల్ – మహేశర్వర్ రెడ్డి
ఖానాపూర్ – రమేశ్ రాథోడ్
బోధ్ – సోయం బాబూరావు
ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు

#కరీంనగర్ జిల్లా

జగిత్యాల – జీవన్ రెడ్డి
మంథని – శ్రీధర్ బాబు
కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
సిరిసిల్ల – కె.కె. మహేందర్ రెడ్డి
పెద్దపల్లి – విజయరామారావు

#వరంగల్ జిల్లా

భూపాల్ పలి – గండ్ర వెంకటరమణారెడ్డి
నర్సంపేట – దొంతి మాధవరెడ్డి
ములుగు – సీతక్క
జనగాం – పొన్నాల లక్ష్మయ్య