దీపావళికి సరికొత్త టపాసులు

SMTV Desk 2018-10-30 14:00:56  deepawali, green crackers,

హైదరాబాద్, అక్టోబర్ 30: ఇటీవల దీపావళి సెలబ్రేషన్స్ మీద కూడా దెబ్బేసింది సుప్రీమ్ కోర్ట్. ఫలానా సమయంలో మాత్రమే బాణాసంచా పేల్చాలన్న నిబంధన అటుంచితే.. కాలుష్య కారక పటాసుల్ని అమ్మకూడదు, కొనకూడదు అంటూ పెట్టిన లిటిగేషన్ మీదే ఇప్పుడు చర్చ నడుస్తోంది. వాయు కాలుష్యానికి చోటివ్వకుండా.. అతి తక్కువ ఉద్గారాల్ని వెదజల్లే టపాకాయలు ఎక్కడ దొరుకుతాయన్నది పెద్ద క్వశ్చన్ మార్క్! సరిగ్గా ఇక్కడే గ్రీన్ క్రాకర్స్ అనే మాట వినిపిస్తుంది.అయితే గ్రీన్ క్రాకర్స్ ఎక్కడ లభిస్తాయని, అవెలా ఉంటాయో తెలియదంటూ సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలోనే చర్చ జరిగింది. దీంతో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్... కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రీ రీసెర్చ్(సీఎస్ఐఆర్) శాస్త్రవేత్తలతో మాట్లాడారు. గ్రీన్ క్రాకర్స్ తయారు చేయాలని సూచించారు..

ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే బాణాసంచా కన్నా తక్కువ ధరకే తయారౌతాయి. తయారీ ఖర్చు 30% తగ్గుతుంది. ఈ బాణాసంచా కాలిస్తే గాల్లోకి వెళ్లే సూక్ష్మకణాల సంఖ్య 25 నుంచి 30 శాతం తగ్గుతుందని, సల్ఫర్ డయాక్సైడ్ కూడా 50 శాతం తగ్గుతుందని మంత్రి చెబుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే ఈ గ్రీన్ క్రాకర్స్ ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. వీటిని ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల్లోనే తయారుచేయొచ్చు.