ప్రారంభంకానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా హాళ్లు

SMTV Desk 2018-10-29 13:07:27  mahesh babu, chain asian cinimas, gachhibowli, thugs of hindusthan

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ థియేటర్ల చైన్ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఆయన ఏఎంబి సినిమాస్ ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సంస్థ యొక్క సినిమా హాళ్ల నిర్మాణం పూర్తైంది. హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలిలోని ఈ మల్టీప్లెక్స్ దీపావళి సందర్బంగా నవంబర్ 8న ప్రారంభంకానుంది. ఈ మల్టీప్లెక్స్ ను మహేష్ బాబు స్వయంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ థియేటర్లలో మొదటగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ లు నటించిన ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ ప్రదర్శితంకానుంది.