'అమర్, అక్బర్, ఆంటొని' టీజర్‌ వచ్చేస్తుంది

SMTV Desk 2018-10-29 12:59:01  raviteja, srinu vaitla, amar akbar anthony, iliyana, ss thaman, mythri movie makers

హైదరాబాద్ , అక్టోబర్ 29: మాస్ మహారాజ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న అమర్, అక్బర్, ఆంటొని చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ మూడు పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.

ఈ చిత్రంలో రవితేజ పక్కన ఇలియానా హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవంబర్ 16న విడుదల చేసేందుకు నిర్మాతలు నవీన్ యేర్నేని, వై రవివశంకర్, మోహన్ (సీవీఎమ్) సన్నాహలు చేస్తున్నారు. ఈ మూవీలో సునీల్, లయ, వెన్నెల కిషోర్, రఘుబాబు, తరుణ్ బరోరా, అభిమన్యు సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.