ఆంద్రాలో స్వైన్‌ ఫ్లూ కలకలం

SMTV Desk 2018-10-28 13:14:58  swine flu, krishna, srikakulam

కృష్ణా, అక్టోబర్ 28: కృష్ణా జిల్లాలో స్వైన్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. దానికి సంబందించిన లక్షణాలతో నలుగురు మృతి చెందగా...పలువురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ ఫ్లూ కృష్ణా జిల్లాలో అనేక చోట్ల కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక శిబిరాలతోపాటు.. ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు.

కాగా మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో కూడా స్వైన్‌ ఫ్లూ కేసులు అత్యధికంగా నమోదు కావడంతో ఆ నగర వాసులు భయాందోలనకు గురవుతున్నారు. రద్దీగా ఉండే నగరాలకు వెళ్లి తిరిగి జిల్లాకు వస్తున్నవారికే ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోందని వైద్యులు చెబుతుండటం ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. వ్యాధి లక్షణాలు వెలుగు చూసిన బాధితులిద్దరూ మహిళలే కావడంతో వ్యాధి కారకాలపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు శ్రీకాకుళం హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన వారు.. కాగా మరొకరు పొందూరు మండలం కింతలి గ్రామానికి చెందిన వారు. దీంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు.