వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు

SMTV Desk 2018-10-27 17:01:53  whatsapp, udates, youtube, facebook

నేటి యువతరానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేనటువంటి వాటిలో ఒకటి వాట్సాప్. ఈ సంస్త రోజురోజుకి కొత్త కొత్త అప్ డేట్స్ ఇస్తూనే వుంటుంది. తాజాగా రెండు కొత్త ఫీచర్లు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఇకపై వాట్సాప్‌లో యూజర్లు యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సైట్లకు చెందిన లింక్‌లలో ఉండే వీడియోలను నేరుగా వాట్సాప్‌లోనే పిక్చర్ ఇన్ పిక్చర్ తరహాలో ప్లే చేసుకోవచ్చు. చాటింగ్ చేస్తూనే అందులోనే మరో విండోలో మరో మెసేజ్‌లలో ఉండే వీడియోలను చూడవచ్చు. అలాగే ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఏ మెసేజ్‌కు అయినా రిప్లయి ఇవ్వాలంటే మెసేజ్‌పై హోల్డ్ చేసి పట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఇప్పుడు మెసేజ్‌పై సింపుల్‌గా స్వయిప్ చేస్తే చాలు.. మెసేజ్‌లకు రిప్లయి ఇవ్వవచ్చు.