విజయ్ దేవరకొండ జాగ్రత్త పడితే మంచిది

SMTV Desk 2018-10-27 15:00:09  Vijay Devarakonda, Nota, Dear comrade

హైదరాబాద్, అక్టోబర్ 27: పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం మూడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ గా నోటా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ దర్శకుడు ఆనంద్ రంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను జ్ఞానవెల్ రాజా నిర్మించారు. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. తమిళ సినిమానే అయినా తెలుగులో విజయ్ ఫాలోయింగ్ క్యాష్ చేసుకునేందుకు నోటా సినిమాను 23 కోట్లకు కొనేశారు.

అయితే సినిమా అంచనాలను అందుకోకపోవడంతో ఫుల్ రన్ లో కేవలం 9.83 కోట్లు మాత్రమే రాబట్టింది నోటా. అంటే పెట్టిన దానికి 40 శాతం రిటర్న్స్ రాగా మిగిలిన 60 శాతం నష్టాలే తెచ్చింది. కెరియర్ మంచి జోష్ లో ఉన్న ఇలాంటి టైంలో విజయ్ కు నోటా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇకమీదట అయినా విజయ్ సినిమాల సెలక్షన్ విషయంలో జాగ్రత్త పడితే మంచిది. లేదంటే అతని కెరియర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.