బీసీసీఐ సంచలన నిర్ణయాలు

SMTV Desk 2018-10-27 12:44:35  bcc, mahendra sing dhoni, virat kohli, t20, captain

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: మహేంద్ర సింగ్ ధోని ఈ పేరు ఎరుగని వారు ఎవ్వరూ వుండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి పెద్దగా పరిచయమున్న భారత క్రికెటర్. ధోని అనగానే అతడు సాధించిన విజయాలు, అందులో భాగంగా వరల్డ్ కప్ కూడా గుర్తొస్తుంది, అలాగే అతని రికార్డులూ వినిపిస్తాయి. అయితే ఈ సంచలన ఆటగాన్నిబీసీసీఐ ఇప్పుడు టీ 20 సిరీస్ ల నుండి కొంత కాలం తొలగించారు. విండీస్, ఆసిస్ తో జరగబోయే టీ 20 సిరీస్ లో ధోనిని తొలగించి, ఆయన స్థానంలో యువ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేశారు. ఇదివరకే ధోని టెస్టుల నుంచి తప్పుకొని, వన్ డేలు, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నారు. ఇప్పుడు టీ20లోనూ స్థానం కోల్పోయాడు. ఇక, మిగిలింది వన్ డేనే. కెప్టన్ గా కూడా తిరుగులేని భాద్యతలను వ్యవహరించి ఇప్పుడు జట్టులో కొనసాగుతున్నారు.

ఇది ఇలా వుండగా ఇక విండీస్ తో జరిగే టీ20 మ్యాచ్ లకు కోహ్లి కెప్టన్ భాధ్యతలు కూడా తాజాగా రోహిత్‌ శర్మకు అప్పగించింది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌కు కూడా సెలక్షన్‌ కమిటీ జట్టును ఎంపిక చేసింది. మురళీ విజయ్‌ తిరిగి జట్టులోకి రాగా.. హనుమ విహారి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

ఈ ఆరు టీ20ల్లో ధోని ఆడబోవట్లేదు. ఎందుకంటే మేం రెండో వికెట్‌ కీపర్‌ స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌ల్లో లేనంత మాత్రాన ధోని టీ20 కెరీర్‌ ముగిసినట్లు కాదు అని ఎమ్మెస్కే ప్రసాద్‌ (బీసీసీఐ చీఫ్ సెలక్టర్) తెలిపారు.