నేడు జరిగే వన్డేలో విజయమెవరిదో...?

SMTV Desk 2018-10-27 12:17:38  pune, team india, west indies, 2nd odi

పూణే, అక్టోబర్ 27: భారత్ - విండీస్ తో జరుగుతున్న 5 వన్డేల క్రమంలో రెండు వన్డేలు పూర్తి కాగా ఈ రోజు పూణేలో మూడో వన్డే జరుగుతోంది. ‌ముగిసిన రెండు వన్డేల్లో ఇరు జట్ల వారు విజృన్భించగా మొదటి వన్డేలో భారత్ విజయం సాధించగా రెండో వన్డే డ్రా గా ముగిసింది. మొదటి వన్డే గువహతి లో జరుగగా 326/2 పరుగులతో విజయ భేరిని మోగించిన భారత్ రెండో వన్డే వైజాగ్ లో జరిగి 321/7 తో మ్యాచ్ డ్రా గా నిలిచింది. మల్లీ ఇప్పుడు ఇరు జట్ల వారు వూపందుకోబొతున్నారు. మూడో వన్డే ఇప్పుడు పూణే లో జరుగుతుంది.

తాజాగా ఇప్పుడు జరుగుతున్న వన్దేలోకి భువనేశ్వర్‌ కుమార్‌, బుమ్రా తోడయ్యారు. చివరి మ్యాచ్ లో వీరిద్దరు లేకపోవడం వల్లనే మ్యాచ్ టై గా నిలిచిందని కొందరు భావించారు. కాగా ఇప్పుడు వీరిని జట్టులోకి తీసుకొన్నారు. భారత క్రికెటర్ల విషయానికొస్తే ధోని రెండు వన్డేల్లో మొత్తం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రాయుడు తొలి వన్డేలో 22 నాటౌట్‌, రెండో వన్డేలో 73 పరుగు లు చేశాడు. కోహ్లి విషయానికొస్తే రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. రెండో వన్డేలో 157 పరుగులు చేసి సచిన్‌ ఫాస్టెస్ట్‌ 10వేల పరుగుల మైలురాయిని 205 ఇన్నింగ్సుల్లో అధిగమించి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఇంతవరకు ఈ సిరీస్‌లో కోహ్లీ 297 పరుగులు చేశాడు. ఇప్పుడు జరుగుతున్న మూడో వన్డేలో కూడా మల్లీ తన సత్తా చాటుతాడు అనేదానికి ఎటువంటి సందేహమూ లేదు.

భారత జట్టు: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, రిషభ్‌ పంత్‌, ఎంఎస్‌ ధోని(వి.కీ), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, , ఖలీల్‌ అహ్మద్‌, ఉమేష్‌ యాదవ్‌, కెఎల్‌ రాహుల్‌, మనీష్‌ పాండే.

వెస్టిండీస్‌ జట్టు: జాసన్‌ హోల్డర్‌ (కెప్టెన్‌) ఫాబియాన్‌ అలెన్‌, సునీ ల్‌ అంబ్రిస్‌, దేవేంద్ర బిషూ, హేమ రాజ్‌, హెట్‌మైర్‌, షాయ్‌ హోప్‌, ఎవిన్‌ లూయీ స్‌, నర్సే, కీమో పాల్‌, రోవ్‌ మ న్‌ పావెల, కీమర్‌ రోచ్‌, మార్లొన్‌ సామ్యూల్స్‌, థామస్