2018 మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయుడు.

SMTV Desk 2018-10-26 19:07:23  golap rabha, mr world 2018, india

హైదరాబాద్, అక్టోబర్ 26: 2018 మిస్టర్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయుడు. అస్సాంకు చెందిన గోలాప్ రభా లూథియానా వేదికగా వరల్డ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్(డబ్ల్యుఎఫ్ఎఫ్)-వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్(డబ్ల్యుబిబిఎఫ్) సంయక్తంగా నిర్వహించిన మిస్టర్ వరల్డ్ పోటీల్లో ట్రోఫీని గెలుచుకున్నాడు.



టెలిగ్రాఫ్‌లో వచ్చిన కథనం ప్రకారం 35 ఏళ్ల గోలాప్ రభా తాను పాల్గొన్న మూడు విభాగాల్లో(పురుషుల ప్రో వరల్డ్ బాడీ బిల్డింగ్, పురుషుల మస్కల్ మోడల్, ప్రో మిస్టర్ వరల్డ్) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా గోలాప్ రభా మాట్లాడుతూ "అంతర్జాతీయ స్టేజిపై వరల్డ్ క్లాస్ బాడీ బిల్డర్లతో తలపడటం చాలా అమేజింగ్‌గా ఉంది. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే విదేశీయులు భారత్‌లో ట్రైనింగ్ కోసం మన ఫోటోలు, ఫోన్ నెంబర్లు అడుగుతుడటమే" అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.





2008లో రభా జూనియర్ మిస్టర్ అస్సాంగా గోలాప్ రభా
2008లో రభా జూనియర్ మిస్టర్ అస్సాం, జూనియర్ మిస్టర్ కామ్‌రూప్ టైటిళ్లను గెలిచాడు. ఆ తర్వాత మిస్టర్ ఇండియా 2017, మిస్టర్ ఇండియా 2018 టైటిళ్ల తోపాటు మిస్టర్ ఆసియా 2018 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, మిస్టర్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత గోలాప్ రభా కుటుంబంలో ఆనందం

వెల్లువిరిసింది.అస్సాం ముఖ్యమంత్రి ప్రశంసలు
మిస్టర్ వరల్డ్ 2018గా ఎంపికైన గోలాప్ రభాపై అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనావాల్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. రభా వరల్డ్ ఫిట్‌నెస్ ఫెడరేషన్(డబ్ల్యుఎఫ్ఎఫ్)-వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్(డబ్ల్యుబిబిఎఫ్) టైటిల్ గెలవడంతో అస్సాంలో బాడీ బిల్డింగ్‌ను ఓ క్రీడగా ప్రమోట్ చేసేందుకు అవకాశం లభించిందని తెలిపారు.2008లో రభా జూనియర్ మిస్టర్ అస్సాంగా గోలాప్ రభా