చిట్టి బాబు రీసౌండ్ అదుర్స్

SMTV Desk 2018-10-26 18:12:16  Rangasthalam, Chittibabu, Rangasthalam TRP ratings

రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. మగధీర తర్వాత చరణ్ కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా ఆల్ టైం ఫేవరేట్ గా నిలిచింది రంగస్థలం. అంతేకాదు నాన్ బాహుబలి రికార్డులను సైతం క్రియేట్ చేసిన రంగస్థలం బుల్లితెర మీద కూడా సూపర్ హిట్ అయ్యింది. అక్టోబర్ 14న స్టార్ మాలో టెలికాస్ట్ అయిన రంగస్థలం సినిమా 19.5 టి.ఆర్.పి రేటింగ్స్ తెచ్చుకుంది.

స్టార్ సినిమా టి.ఆర్.పి రేటింగ్స్ లో ఇది తక్కువే అయినా రంగస్థలం రిలీజైన 45వ రోజే అమేజాన్ ప్రైం లో రావడం.. థియేట్రికల్ రన్ లో కూడా రిపీటెడ్ ఆడియెన్స్ చూడం జరిగింది. అయినా సరే స్మాల్ స్క్రీన్ పై 19.5 రేటింగ్ అంటే గొప్ప విషయమే. ఇక బుల్లితెర టి.ఆర్.పి లలో కూడా బాహుబలి రెండు పార్టులు రికార్డ్ స్థాయిలో రాబట్టగా సెకండ్ పొజిషన్ లో చరణ్ మగధీర 24 టి.ఆర్.పి రేటింగ్స్ తో లీడింగ్ లో ఉంది.

ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు వినయ విధేయ రామా అనే టైటిల్ పరిశీళణలో ఉంది.