పోలీసు అధికారులకు ఏపీ సీఎం సూచనలు...

SMTV Desk 2018-10-26 17:27:04  ap poice, chandrababu, cyber crime

విజయావాడ, అక్టోబర్ 26: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న విశాఖలో తన పై దాడి జరిగిన తరువాత ఆ సంఘటనలో భాగంగా వైఎస్‌ఆర్‌సిపి నాయకులు తనని ఏ1 నిందితుడిగా, డీజీపీని ఏ2గా పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్‌ నేర సమీక్షలో భాగంగా వివిధ విభాగాల పోలీసు అధికారులతో సిఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని మీడియా ఛానళ్లు పనిగట్టుకుని తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతున్నాయని.. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి సీఎం స్పందిస్తూ ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. మీడియాను సక్రమంగా వినియోగించుకుని ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని సూచించారు.