భారత తొలి మహిళా ఎంపైర్స్ వీరే...

SMTV Desk 2018-10-26 16:09:05  india, first women umpires, vrunda rati, janani

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: నేటి సమాజంలో మహిళలూ ఎందులోనూ తగ్గడం లేదు. తమకంటూ ఏది సాధ్యం కానిది లేదు అంటూ అన్ని రంగాల్లో సత్తాచాటుతున్నారు. మనకు మహిళల క్రికెట్ అంటే తెలుసు వాళ్ళు ఆట ఆడి ఎన్నో రికార్డులు తిరగరాస్తున్నరానేది చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే మైదానంలో ఎంపైర్ గా చేస్తే ఎలా ఉంటుందో చూడడానికి సిద్దంగా ఉండాలి. అయితే తొలి మహిళా క్రికెట్ ఎంపైర్ గా వృందా రటి, జనని మనకు పరిచయమవబోతున్నారు.

అంపైరింగ్ చేయటం అనుకున్నంత సులువు కాదు. చాలా ఏకాగ్రత, సునిశితమైన దృష్టి ఉండాలి. నిర్ణయం తీసుకోవడంలోనే అంపైర్‌ సామర్థ్యం తెలుస్తుంది. ఎంతో సునిశితంగా ఆటను, ఆటగాళ్ల కదలికలను గమనించాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సందర్భాను సారంగా క్షణాలలో నిర్ణయం తీసుకోవాలి. లేదంటే క్రికెట్ లో ఆటగాళ్ల తలరాతలు మారిపోతాయి. దేశాల క్రికెట్ చరిత్రలు తిరగబడిపోతాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ఏ మ్యాచ్‌లో అంపైర్‌గా ఎంపిక అవ్వడానికి కూడా అర్హత పరీక్షలు ఉంటాయి. వాటిని సాధిస్తేనే అవకాశం వస్తుంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటు సమస్యలను అధిగమించుకుంటు ఎంపైర్ స్థానాన్ని అంది పుచ్చుకున్నారు వృందా రటి, జననిలు. వీరే తొలి మహిళా ఎంపైర్స్.