మీ సేవ కార్యాలయాలు బంద్...?

SMTV Desk 2018-10-26 12:51:09  MEE SEVA, VOTER LIST, GOVERNAMENT

హైదరాబాద్, అక్టోబర్ 26: మీ సేవ కేంద్ర బృందం ప్రభుత్వ తీరుకు నిరసనగా నవంబర్ 1 నుండి మీ సేవ కార్యలయాలు ముసివేస్తామంటున్నారు. వివరాల ప్రకారం రానున్న ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీ అభ్యర్థులు, ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం ఎవరి పనుల్లో వారు ఉన్నారు. కాగా వోటర్లు అంత మీ సేవ కార్యాలయాల వైపే చూస్తున్నారు. కొత్తగా పేరు నమోదు చేసుకున్న వారికి కార్డులు లేవు.

పూర్వం నమోదు చేసుకున్న వారిలో కూడా కొంతమందికి కార్డులు లేవు. ఈ తరుణంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా మీసేవ ఆపరేటర్లు ఆం దోళనకు సిద్ధమవుతున్నారు. పదేళ్ల క్రితం ధరలు నిర్ణయించిన ప్రభుత్వం ప్రస్తుత ఖర్చును లెక్కలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలను సవరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 1 నుంచి మీసేవ కేంద్రాలను మూసివేస్తామంటున్నారు.