మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరానికి ఊరట

SMTV Desk 2018-10-25 15:07:44  Chidambaram, INX Media, High Court

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆయనను నవంబరు 29 వరకు అరెస్టు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

యూపీఏ-1 ప్రభుత్వంలో పి. చిదంబరం ఆర్థిక మంత్రిగా పని చేసిన కాలంలో ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అనుమతులు లభించాయి. ఈ అనుమతుల మంజూరులో అక్రమాలు జరిగినట్లు సీబీఐ ఆరోపించింది.

2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ రూ.305 కోట్ల మేరకు విదేశీ నిధులను స్వీకరించిందని ఆరోపిస్తూ గత ఏడాది మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం కూడా ఫిబ్రవరి 28న అరెస్టయ్యారు. ఆయన రూ.10 లక్షలు స్వీకరించినట్లు సీబీఐ ఆరోపించింది. ఆయనకు మార్చి 23న బెయిలు మంజూరైంది.