మహాకూటమికి ఓటేస్తే మళ్లీ వెనుకటిరోజులే -కెటిఆర్‌

SMTV Desk 2018-10-25 14:29:34  KTR,TRS,MAHAKOOTAMI,24HOURS POWER SUPPLY,ELECTIONS

సిరిసిల్ల, అక్టోబర్ 25: ఈరోజు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో తెరాస పార్టీ ఎన్నికల ప్రచార సందర్భంగా కెటిఆర్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లడుతూ మహాకూటమి గురించి సంచాలన వాఖ్యానాలు చేశారు.వ్వవసాయానికి 24గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కోన్నారు.67 ఏళ్లలో ఏం చేయని వారు తమ ప్రభుత్వ చేస్తుంటే గగ్గోలు పెడుతున్నారని ఆయన విమర్శించారు. అధికారంలో వున్న రాష్ట్రాల్లో ఏం అభివృధి చేయకుండా ఇక్కడ ఏం చేస్తారు అని హేళన చేశారు. కాగా మహాకూటమికి ఓటేస్తే మళ్లీ వెనుకటిరోజులే వస్తాయని ఆయన అన్నారు.