డ్రగ్స్ వ్యవహారం పై చంద్రబాబు

SMTV Desk 2017-07-20 17:44:39  Chandrababu, on, the, issue, of, drugs

చిత్తూరు, జూలై 20 : ఇటీవల సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజక వర్గంలో పర్యటిస్తున్న ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. కుప్పం నియోజక వర్గంలో పర్యటించిన ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసారు. గుడిపల్లిలో లో ఒక వాటర్ ప్లాంట్, ప్రభుత్వ జూనియర్ కాలేజిని చంద్రబాబు ప్రారంభించారు. 615 కిలోమీటర్ల నుంచి కృష్ణ జలాలను తీసుకొస్తామని చెప్పారు. హుద్రి-నీవా కాలువ సాగునీటితో కల సహకారం అవుతాయని అన్నారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యవహారం పై ఆయన స్పందిస్తూ ' ఆస్తులు ఎక్కువైతే ఇలాంటి దురలవాట్లు వస్తాయని ఇందుకు నిదర్శనం రెండు రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యవహారమే” అని ఆయన అన్నారు”. బెల్టు షాపులు ఎక్కడున్నా బంద్ చేయాలి” అని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు.