ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో ఆ ముగ్గురు

SMTV Desk 2018-10-25 11:43:38  FENCH OPEN WORLD TOUR, SAINA NEHWAL, SRIKANTH, SAI PRANEETH

ఫ్రెంచ్ వోపెన్ వరల్డ్ టూర్ సూపర్-75౦ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ సైనా, సాయి ప్రణీత్, శ్రీకాంత్ ప్రీక్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. వీరి స్కోరు విషయానికొస్తే సైనా తొలి రౌండ్ లో 21-11, 21-11 తో సయేనా కవాకమి(జపాన్)పై, శ్రీకాంత్ 21-19, 21-13 తో విన్సెంట్(హాంకాంగ్)పై, అలాగే సాయి ప్రణీత్ 21-13, 21-17తో యోగర్ కొయిలో(బ్రెజిల్)పై గెలిచారు. కాగా మరో మ్యాచ్ లో సమీర్ వర్మ 21-16, 17-21, 15-21తో జోనాథన్ క్రిస్టీ(ఇండోనేషియా) చేతిలో వోటమి పాలయ్యాడు.