భారత్- విండీస్ మ్యాచ్ టై...

SMTV Desk 2018-10-25 11:00:01  VIRAT KOHLI,ODI,TEAM INDIA,WEST INDIES,MATECH DRAW

వైజాగ్ అక్టోబర్ 25: భారత్- విండీస్ తో నిన్న వైజాగ్ లో జరిగిన రెండో వన్డే చాలా హోరాహోరీగా సాగి చివరకు టై అయ్యింది. చాలా రోజుల తరువాత క్రికెట్ అభిమానులకు నిన్న జరిగిన మ్యాచ్ కన్నుల పండుగగా సాగింది. ఎవరికివారు తమదైన శైలిలో ఆడుతూ చెలరేగిపోయారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ని ఎంచుకొని విండీస్ కి 322 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.ఎప్పటిలాగే ఈ సారి కూడా మనదే విజయం అనుకొని భారత అభిమానులందరూ కాం గా ఆటను చూస్తున్నారు.కానీ ఆ పరుగుల లక్ష్యాన్ని చేధించాలన్న కసితో విండీస్ ఆటలో విజ్రున్భించింది. ఈ ఆటను చూస్తున్న అభిమానులకు ఫుల్ మీల్స్ లాగే అయ్యింది నిన్న. విరాట్ కోహ్లి మాత్రం క్రీజులో దిగి ఆట ముగిసే వరకు నిలకడ కోల్పోకుండా ఆడాడు. అలాగే ఒక కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. రికార్డుల విషయానికొస్తే అతనికి కొత్తేం కాదు. అలాగే నిన్న 157 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.

భారీ విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ జట్టుకు...ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న కీరన్ పావెల్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత విండీస్ బ్యాట్స్‌మెన్....చంద్రపాల్ హేమరాజ్, మార్లోన్ శ్యామూల్స్‌ను...స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ షైహోప్‌కు జత కలిశాడు. ఇద్దరు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఫోర్లు, సిక్సర్లతో భారత్ బౌలర్లను వణికిపోయేలా చేశారు. వీరిద్దర బ్యాటింగ్ దెబ్బకు విండీస్ సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. అయితే 32వ వోవర్‌లో చాహల్....94 పరుగులు చేసిన హెట్‌మెయిర్‌ను పెవిలియన్‌కు పంపాడు.

హెట్‌మెయిర్ అవుటయినప్పటికీ షైహోప్ తన జోరును ఏ మాత్రం తగ్గించలేదు. సమయం వచ్చినప్పుడల్లా బౌండరీలు కొడుతూ...విండీస్ జట్టును లక్ష్యంగా పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసిన షైహోప్....తన జట్టును గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. ఇన్నింగ్స్ చివరి వోవర్‌లో 14 పరుగులు అవసరమైతే....ఈ సమయంలో ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తొలి 5 బంతులకు 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతి వచ్చేసరికి అభిమానులతో పాటు ఇరు జట్ల ఆటగాళ్లలో ఒకటే ఉత్కంఠ. 5 పరుగులు చేస్తే విండీస్ విన్ అవుతుంది....ఫోర్ కొడితే మ్యాచ్ డ్రా అవుతుంది. అయితే ఫోర్ కొట్టి...మ్యాచ్‌ను టై చేశాడు షైహోప్.

49వ వోవర్‌లో షమీ 6 పరుగులివ్వడంతో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. భారత జట్టు విజయం దాదాపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో విండీస్ బ్యాట్స్‌మెన్ స్ఫూర్తిదాయకంగా పోరాడారు. ఇన్నింగ్స్ చివరి వోవర్ వేసే అవకాశం ఉమేశ్ యాదవ్‌కు దక్కింది. తొలి మూడు బంతులకు ఉమేశ్ 7 పరుగులిచ్చాడు. నాలుగో బంతికి నర్స్ అవుట్. ఐదో బంతికి రెండు పరుగులు..

ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరం కావడంతో మళ్లీ విజయం విరాట్‌సేన వైపే మొగ్గింది. కానీ ఉమేశ్ అవుట్‌సైడ్ ఆఫ్‌గా వేసిన చివరి బంతిని హోప్ లాగిపెట్టి కొట్టడంతో పాయింట్ దిశలో బౌండరీ వైపు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. రాయుడు అడ్డుకునేందుకు జారినా బంతి రోప్‌ను ముద్దాడటం.. మ్యాచ్‌ టై కావడం క్షణాల్లో జరిగిపోయింది. అంతే ఒక్కసారిగా స్టేడియం మూగబోగా, విండీస్ వీరులు సంబరాలు చేసుకున్నారు.
స్కోర్లు..
భారత్‌ 321/6
విండీస్‌ 321/7
కోహ్లీ(157 నాటౌట్‌) వన్డేల్లో 37వ సెంచరీ
షైహోప్‌(123 నాటౌట్)
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ - కోహ్లీ