కోహ్లీ రికార్డు

SMTV Desk 2018-10-24 16:28:08  kohli, Virat Kohli, 10000 runs

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులున్నాయి. ఎన్నో రికార్డులను తిరగరాసిన కోహ్లీ మరో మైలురాయిని దాటాడు. వన్డేల్లో 10 వేల పరుగులను పూర్తి చేశాడు. విశాఖపట్నంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్‌ ఈ ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 205 ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకుంటే.. సచిన్ టెండూల్కర్ 259 ఇన్నింగ్స్‌లు, సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్‌ 266 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు.