బయోపిక్‌లో ప్రియదర్శి లీడ్‌ రోల్‌

SMTV Desk 2018-10-24 14:10:44  comidian priyadarshi , biopic

హైదరాబాద్ అక్టోబర్ 24; పెళ్లి చూపులు సినిమా నుంచి మంచి కమేడియన్ గా దూసుకు పోతున్న యువ నటుడు ప్రియదర్శి ఇప్పుడు యంగ్ హీరోల సినిమాలతో కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్నాడు . త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఓ బయోపిక్‌లో ప్రియదర్శి లీడ్‌ రోల్‌లో నటించనున్నాడు.

పద్మశ్రీ అవార్డు అందుకున్న చేనేత కార్మికుడు మల్లేశం జీవిత కథ ఆధారంగా సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ రూపొందించనున్న సినిమాలో ప్రియదర్శి టైటిల్‌ రోల్‌లో నటించనున్నాడు. నేతన్నలకు శ్రమ తగ్గించేలా కొత్త యంత్రాన్ని కనుగొన్న మల్లేశం జీవితాన్ని రియలిస్టిక్‌గా తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇటీవల తానూ నటించిన మిథై మూవీ ట్రైలర్ లో ప్రియదర్శి కామెడీ అదుర్స్ అనిపించేలా చేసినందుకు సినిమా పై మంచి అంచనాలేన్నాయి.