ఆరంభంలోనే విజయం

SMTV Desk 2018-10-24 12:21:56  pv sindhu,Beiwen Zhang, french open ,

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఫ్రెంచ్ వోపెన్ లో అమెరికా స్టార్ బీవెన్ జాంగ్ ను చిత్తుచేసి శుభారంభం చేసిన భారత స్టార్ షట్లర్ పివీ సింధు.సింగిల్స్ తొలిరౌండ్లో మూడోసీడ్ సింధు 21-17, 21-8 తేడాతో జాంగ్ ని వోడించింది.

గతవారం డెన్మార్క్‌ వోపెన్‌లో జాంగ్‌ చేతిలో ఎదురైన వోటమికి ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్‌ ఆరంభంలో జాంగ్‌ పైచేయి సాధించినప్పటికీ...సింధు క్రమంగా పుంజుకుంది. 7-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆమె.. తర్వాత దాన్ని 10-6కు పెంచుకుంది. ఐతే జాంగ్‌ వరుసగా ఐదు పాయింట్లు సాధించి 11-10 ఆధిక్యంలోకి వెళ్లింది. 16 పాయింట్ల వరకు మ్యాచ్ హోరాహోరీగా సాగి,ఆ తర్వాత సింధు తొలి ఆటలో విజయం సాదించి,అదే క్రమంలో రెండో ఆటలో కూడా విజయాన్ని సాధించి,మ్యాచ్ ని సొంతం చేసుకుంది.