కోహ్లికి విషెస్ చెప్పిన చంద్రబాబు

SMTV Desk 2018-10-24 11:49:14  virat kohli,nara chandrababu naidu

విశాఖపట్నం, అక్టోబర్ 24: బుదవారం వైజాగ్ వేదికగా జరుగుతున్న భారత్-విండీస్ రెండో వన్డే లో బాగంగా నిన్న టీంఇండియా వైజాగ్ లో దిగారు .వారు వొచ్చిన అనంతరం విరాట్ కోహ్లి విశఖపట్నం అందాలకు ముగ్దుడై "అద్భుతమైన ప్రదేశం. విశాఖకు రావడాన్ని ఎంతో ప్రేమిస్తాను" అని ట్వీట్ చేశారు. అయితే విరాట్ కోహ్లీ ట్వీట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.


"వైజాగ్ అనే ప్రదేశం ఈ దేశం, ప్రపంచం ప్రేమించే గమ్యస్థానం అవుతుంది. విశాఖ వన్డే సందర్భంగా విరాట్ కోహ్లీతో పాటు టీమిండియాకి శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు.

టీమ్‌ఇండియాకు బాగా కలిసొచ్చిన వేదికగా విశాఖపట్నంలోని వీడిసీఐ స్టేడియంను చెప్పుకోవచ్చు. ఈ స్టేడియంలోనే ధోని తన సత్తా చాటి చరిత్రను నమోదు చేశాడు.మొదటి వన్డేలో బౌలింగ్ విభాగంలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఈ రోజు వన్డేలో ఆడనున్న టీమిండియా ఆటగాళ్ల జాబితా: విరాట్ కోహ్లీ (కెప్టేన్), శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిశబ్ పంత్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ఉమేష్ యాదవ్, మొహమ్మద్ షమీ, సయ్యద్ ఖలీల్ అహ్మెద్