పరవళ్ళు తొక్కుతున్న గోదావరి

SMTV Desk 2017-07-20 16:58:23  Godavari, dam

రాజమండ్రి, జూలై 20 : గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. రాజమండ్రి లో భారీ వర్షపు నీరు చేరటంతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. గురువారం మధ్యాహ్నంకు నీటి మట్టం 8.2 చేరుకుంది. భద్రాచలం నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ధవళేశ్వరం బ్యారేజికి సుమారుగా 3.34 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో, మొత్తం 170 గేట్‌లను ఎత్తి వేశారు. ఆనకట్ట నుంచి 3,36,500 క్యూసెక్కుల నీటిని దిగువన వదులుతున్నారు. భారీగా వరద నీరు వస్తుండటంతో సాయంత్రానికి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.