వైజాగ్ అందాలకు ముగ్దుడైన కోహ్లి

SMTV Desk 2018-10-23 19:16:46  virat kohli,team india,vishkapatnam

విశాఖపట్నం,అక్టోబర్ 23:బుదవారం విశాఖపట్నం వేదికగా చేసుకుని పర్యాటక విండీస్ తో తలపడే భారత జట్టు ఇటీవలే వైజాగ్ చేరుకుంది.కాగా వైజాగ్ అందాలకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫిదా అయ్యాడు .సాగరతీరంలోని వొ ఫైవ్‌స్టార్ హోటల్లో బస చేశాడు. ఆ హోటల్ నుంచి సాగర అందాలను చూసి ముగ్ధుడయ్యాడు. వెంటనే బీచ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వో సెల్ఫీ దిగి.. ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. వైజాగ్‌ ఎంత అద్భుతంగా ఉందో.. ఇక్కడికి రావడాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాను అని కాప్షన్ పెట్టాడు. గతంలో ధోనీ, హర్భజన్‌సింగ్‌, రోహిత్‌శర్మ కూడా విశాఖ అందాలను పొగుతుడూ పోస్ట్‌లు పెట్టారు.