కోహ్లీ సెంచరీకి ఫిదా అయిన తమీమ్

SMTV Desk 2018-10-23 19:06:37  team india , tamim iqbal,bangladesh,

హైదరాబాద్, అక్టోబర్23:బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ టీంఇండియా సారథి విరాట్ కోహ్లి పై ప్రసంశల వర్షం కురిపించాడు.విరాట్ కోహ్లీలో ఏదో శక్తి దాగి ఉందని తాజాగా ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా విండిస్‌తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 36వ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.
గువహటి వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 140 పరుగులు చేయడంతో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డుని సమం చేశాడు. వరుసగా మూడు కేలండర్‌ ఇయర్స్‌ (20016-18)లో 2000కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగానూ సచిన్‌ టెండూల్కర్, మాథ్యూ హెడెన్‌, జో రూట్‌ సరసన కోహ్లీ నిలిచాడు. కోహ్లీ సెంచరీకి ఫిదా అయిన తమీమ్ ఈ సందర్భంగా ఖలీజ్‌ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమీమ్ మాట్లాడుతూ "కోహ్లీ ఆటను చూస్తుంటే నాకు అతను మనిషేనా అనిపిస్తోంది. ప్రతి మ్యాచ్‌లో సెంచరీ చేసేలా కనిపిస్తున్నాడు. ఆటపట్ల అతనికున్న నిబద్దతను చూస్తుంటే నమ్మబుద్ది కావడం లేదు" అని అన్నాడు.
"మూడు ఫార్మాట్లలో అతడే ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌. కోహ్లీ కూడా ఎవరినో వొకరిని ఆరాధిస్తూ అతని నుంచి ఎదో వొకటి నేర్చుకొని ఉంటాడు. గత 12 ఏళ్లుగా నేను ఎంతో మంది గొప్ప ఆటగాళ్లను చూశాను. వారందరిలో ఎవరి ప్రత్యేక వారిదే. కానీ నాకు వారిలో కోహ్లిని డామినేట్‌ చేసే ఆటగాడు వొక్కరు కూడా కనిపించలేదు. నిజంగా కోహ్లీ వో అద్భుతం" అని అన్నాడు.