మల్లి ఇప్పుడు కొత్త లుక్‌లో మార్కెట్లోకి హ్యుండాయ్ సాంత్రో కారు

SMTV Desk 2018-10-23 18:39:19  hyundai,santro,sharukh khan

హ్యుండాయ్ సాంత్రో కారు 1998 లో వొచ్చి 2014 డిసెంబర్ వరకు మార్కెట్ లో మంచి గిరాకి తెచ్చుకుంది.అప్పటికే మొత్తం 13 లక్షల సాంత్రో కార్లను అమ్మారు. తరువాత దాన్ని నిలిపివేసింది, మల్లి ఇప్పుడు కొత్త లుక్‌లో మార్కెట్లోకి ప్రవేశించింది. బాలీవుడ్ స్టార్, సాంత్రో అంబాసిడర్ షారుక్ ఖాన్ ఇవాళ ఈ కారును ఆవిష్కరించారు. ఇప్పుడు అదే మోడల్‌ను కొత్త లుక్, ఆధునిక టెక్నాలజీతో తీసుకొచ్చారు. 4-సిలిండర్ 1.1 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న ఈ కారులో తొలిసారి ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ, సీఎన్‌జీ ఫ్యుయెల్ ఆప్షన్స్ అమర్చారు. ఈ కారు ప్రారంభ ధరను రూ.3.89 లక్షలుగా నిర్ణయించారు.