అలా చేస్తే ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆడతారు ;వార్న్

SMTV Desk 2018-10-23 18:04:07  australia,shen warn,

హైదరాబాద్ అక్టోబర్ 23:ఆస్ట్రేలియా స్పిన్నర్ షేన్ వార్న్ తమ సొంత జట్టు పై చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇదివరకు పాకిస్తాన్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆసిస్ చాలా ఘోరంగా వోటమి పాలయ్యింది.

మొదటి టెస్ట్ అతి కష్టం మీద డ్రా చేసుకోగా రెండో టెస్ట్ 373 భారి పరుగుల తేడాతో వోటమి పాలయ్యింది.దీనిపై వార్న్ స్పందిస్తూ "తామంతా జట్టుకు మద్దతుగానే ఉంటామని, ప్రస్తుత పరిస్థితుల్లో జట్టును వెనక నుంచి తన్నాల్సిన అవసరం ఉందని, అలా చేస్తే వొళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఆడతారని పేర్కొన్నాడు.

మిచెల్ మార్షన్‌ను వైస్ కెప్టెన్‌గా ఎందుకు సెలక్టర్ చేశారని సెలక్టర్లను ప్రశ్నించాడు. అతడిప్పటి వరకు జట్టులో నిలదొక్కుకోనే లేదని, అటువంటి వ్యక్తిని ఏకంగా వైస్ కెప్టెన్ చేయడం ఏమిటని నిలదీశాడు. సెలక్టర్ల చర్య తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. తాను మార్షల్ బ్రదర్స్‌కు చాలా అభిమానినని అయినా.. ఆటలో ప్రదర్శన బాగుండకపోతే జట్టులో ఉంచడంలో న్యాయం లేదు.'

మిచెల్ మార్ష్ కనుక సెంచరీలు బాదేసిన రికార్డు కలిగి ఉంటే అతణ్ని జట్టులోకి తీసుకుంటే బాగుండేది. అలాగే షాన్ మార్ష్ కూడా చేసినట్లు అయితే తీసుకోవాల్సింది. అలా కాకుండా ఫామ్‌లో లేని వాళ్లను జట్లులోకి తీసుకోవడం హేయమైన చర్య. వొకవేళ వాళ్లు సరిగ్గా ప్రదర్శన చేయకపోతే అది జట్టుకు అవమానకరంగా నిలుస్తుంది. బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో మాట్లాడిన షేన్ వార్న్ సంవత్సరారంభంలో బాల్ ట్యాంపరింగ్ విషయంలో ఆస్ట్రేలియా క్రికెట్ దెబ్బతిన్న పరిస్థితి గుర్తు చేశాడు.

ఏ వ్యాపారంలో అయినా ఫౌండేషన్ అనేది పటిష్టంగా ఉండాలి. అలాగే ఆస్ట్రేలియా క్రికెట్‌లో పునాదులు బలంగానే ఉన్నాయి. కానీ, క్లబ్ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్, ఫెఫ్ఫీల్డ్ క్రికెట్‌లు బాగా రాణించాల్సి ఉంది. ప్రస్తుతమున్న ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు సరిపోతారని నేననుకోవడం లేదు. స్కూల్ లెవల్ నుంచే క్రికెట్‌ను పటిష్టం చేస్తే మరోసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుంది." అంటూ వెల్లడించాడు.