అలాంటి పుకార్లను నమ్మొద్దు..!

SMTV Desk 2018-10-23 17:21:20  Anupama , prakash raj , ram

హైదరాబాద్ , అక్టోబర్ 23 ; రామ్‌ హీరోగా తెరకెక్కిన హలో గురు ప్రేమ కోసమే సినిమాలో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్‌ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఓ రోజు నేను షూటింగ్‌కు వెళ్లలేదు, అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నాను. ప్రకాశ్‌రాజ్‌తో సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. దాన్ని ఆధారంగా తీసుకుని పుకార్లు సృష్టించారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి పుకార్లను నమ్మొద్దని అన్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు త్రినాథరావు దర్శకుడు. బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించారు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం అని, చిత్రం బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారని హీరోయిన్‌ అనుపమ అన్నారు. ఇకపై మంచి కథలను ఎంచుకోవడానికే ప్రాముఖ్యనిస్తానని తెలిపారు.